Take a fresh look at your lifestyle.

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించాలి -జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు.
శుక్రవారం రంగారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అధికారులకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పి.మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు నారాయణ రెడ్డి, మను చౌదరి, దీపక్ తివారి, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ లు వినయ్ కుమార్ రెడ్డి, సృజన ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించి ప్రధాన అంశాలపై చర్చించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు మంచి పేరు వస్తుందని ఆయన. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు జవాబుదారి తనంతో పని చేయాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి ఐటీ, పరిశ్రమల మరియు వాణిజ్య శాఖ మంత్రి మాట్లాడుతూ.. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల పాటు చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో జవాబుదారీ తనంతో ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తెలిపారు. 99 రోజుల పాటు చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ అందని వారిని గుర్తించి నిర్లక్షం వహించకుండా అమలు కాని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులకు సూచించారు.

శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… 99 రోజుల పాటు చేపట్టే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో 10 అంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకుప్రజల వద్దకే అధికారులు వస్తున్నారన్నారు. ఇప్పటికీ రేషన్ కార్డులు, ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లను కేటాయించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు.

వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను నెరవేర్చే దిశగా పని చేస్తామన్నారు. జిల్లాలోని 4 నియోజకవర్గాలకు నోడల్ అధికారులను నియమించడం జరిగిందని అన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో అధికారులను సమన్వయం చేసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. అనంతగిరి ఈకో పార్క్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. హౌసింగ్ ద్వారా ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు చెల్లింపులు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. గ్రామ పంచాయతీల్లో నీటి కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జిల్లాలోని 106 గురుకుల పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా, మండల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నాణ్యమైన భోజనాన్ని అందించే దిశగా పనిచేస్తామని ఆయన తెలిపారు. ఈ అవగాహన సమావేశంలో శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, శంకరయ్య, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిలతో పాటు వివిధ శాఖల చైర్మన్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.