ముద్ర ప్రతినిధి, భువనగిరి :
అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్ర వారం మండలంలోని తుక్కాపురం గ్రామంలో ఎలకొండ బుచ్చి రెడ్డి ఇంటి వద్ద రైతు సంఘం గ్రామ
మహాసభ నోముల మహేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ స్వేచ్ఛ వ్యాపారం వలన రైతాంగం తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతారని వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతుందని ఆయన అన్నారు పత్తి, సోయా, మొక్కజొన్న, విదేశాల నుండి దిగుమతి అవుతే భారతదేశా రైతాంగం పండించిన పంటలు మద్దతు ధరలు రాక తీవ్రంగా నష్టపోతారని ఆయన అన్నారు. అమెరికాలో మిగతా యూరప్ దేశాలలో వ్యవసారంగానికి అత్యధికంగా సబ్సిడీలు ఇస్తారని ,ఉత్పత్తి ఖర్చు తక్కువ అక్కడ ఉంటుందని అక్కడి నుండి భారతదేశానికి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అయితే మన దేశంలో పండించిన పంటలకు ధరలు లేక రైతాంగము నష్టపోతారని ఉదాహరణకు పత్తిపై భారతదేశం విధించే దిగుమతి సుంకాన్ని రద్దు చేయడం వలన విదేశాల నుండి పత్తి భారత్ కు దిగుమతి అవడం వలన భారతదేశ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన కేంద్రాన్ని విమర్శించారు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్తు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ఈ చట్టం అమలు అయితే భారతదేశవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు అధికమవుతాయని ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం లో రైతాంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్తు అందకుండా వ్యవసాయ ఉత్పత్తి తగ్గుతుందని దాని వలన ఆహార భద్రత పథకానికే తీవ్రమైన నష్టం కలుగుతుందని విద్యుత్తు సవరణ చట్టాన్ని ఉపసంహరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి యూరియా బుకింగ్ యాప్ ను తక్షణమే రద్దు చేయాలని ఈ యాప్ వలన రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారని అవసరమైన రైతులకు యూరియా అందకుండా ఉంటుందని ప్రైవేటు వ్యాపారస్తులతో అధిక రేటుకు కొనుగోలు చేయాల్సి వస్తుందని యూరియా బుకింగ్ యాప్ ను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే రైతాంగానికి అవసరమైన యూరియాను ఇవ్వాలన్నారు. యాసంగిలో ముందస్తుగాప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు కు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు, ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల వలన దెబ్బతిన్న పంటలను పరిశీలించి పంట నష్టపరిహారం అందివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం
నూతన రైతు సంఘం గ్రామ
అధ్యక్షులుగా గుండెబోయిన దానయ్య, ఉపాధ్యక్షులుగా రాసాల వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా నోముల మహేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా రాసాల మల్లేష్, మర్రి నరేందర్ రెడ్డి, వల్లపు పర్వతాలు, జనగాం అశోక్, కోశాధికారిగా రాసాల వెంకటేశం ఎన్నికయ్యారు.
ఈ మహాసభలో మాకోలు యాదయ్య, వల్లపు కొండయ్య, జిల్లా సత్తయ్య, దండబోయిన పాండు, వీరబోయిన నరసింహ, కడారి వెంకటేశం, రత్నపురం పాండు, వెలకొండ సుధాకర్ రెడ్డి, గుండెబోయిన దానయ్య, రాసాల మహేష్, రాసాల శ్రీశైలం, మర్రి నరేందర్ రెడ్డి, కంబాల నరసింహ, రత్నపురం కోటేష్ పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.