Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు– టి యు డబ్ల్యూ జే (ఐజేయు) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ

 

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………..
అర్హత ఉన్న ప్రతి జర్నలిస్ట్ కు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని టీయు డబ్ల్యూ జే (ఐజేయు) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, ఫోటో, వీడియో,డెస్క్ జర్నలిస్టు, ఉర్దూ మీడియా విభాగాల్లో వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ అక్రిడేషన్ కార్డు లు మంజూరు చేయాలన్నారు. జీవో 252 లో లోపాలు ఉన్న కారణంగానే యూనియన్ తరపున ముందుగానే ప్రభుత్వం, సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ఇప్పటికే కొన్ని సవరణలు చేసినట్లు ఆయన తెలిపారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ల కేటాయింపులో కోత పెడుతున్నారనే అపోహలు ఉండ వద్దన్నారు. ఇప్పటికే ఐ అండ్ పి ఆర్ కమిషనర్ తో పాటు సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇటీవల డెస్కు జర్నలిస్టులు చేసిన నిరసన కార్యక్రమాలకు టీయూడబ్ల్యుజే మద్దతు ప్రకటించిందన్నారు.
టియుడబ్ల్యూ జే ఆరున్నర దశాబ్దాలకు పైగా జర్నలిస్టుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నదని, ఏ ప్రభుత్వానికి,పార్టీకి కొమ్ముకాయదని విరాహత్ అలీ స్పష్టం చేశారు. మండల విలేకరులకు అక్రిడేషన్ కార్డులు అందుతాయన్నారు.
రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ మాట్లాడుతూ… ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యూనియన్ బలోపేతానికి ప్రతి సభ్యుడు కృషి చేయాలన్నారు.వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ అక్రిడేషన్ కార్డుల విషయంలోనే కాకుండా ఆరోగ్యం విషయంలోనూ యూనియన్ నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో యూనియన్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాటం నాగరాజుగౌడ్, ఎన్.సతీష్ కుమార్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ అహ్మద్ పాషా, జిల్లా కోశాధికారి జిల్లెల రఘు ఆయా పత్రికల, చానళ్ళ జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.