ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండల కేంద్రంలో గల విశాల సహకార పరపతి సంఘం ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలని, పంట విస్తీర్ణం బట్టి ఎరువులు రైతులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే మెట్పల్లి- పంట విస్తీర్ణం బట్టి రైతులకు ఎరువులు అందజేయాలని సహకార సంఘాల కార్యదర్శులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎరువుల విక్రయముపై పలు సూచనలు చేశారు. రైతుల ఆధార్ కార్డ్, పాస్ పుస్తకము జిరాక్స్ కాపీలను తీసుకొని ఎరువులు విక్రయించాలని పి ఓ మిషన్ ఆధారంగానే రైతులకు విక్రయించాలని తెలిపారు. కలెక్టర్ వెంట సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టర్ ఎం శ్రీనివాస్, సీనియర్ ఇన్స్పెక్టర్ నిజాం, మెట్ పల్లి సహకార సంఘ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి పాల్గొన్నారు.
