Take a fresh look at your lifestyle.

పీఎఫ్, ఇన్సూరెన్స్ బకాయిలకు కోర్టులకు సంబంధం లేదు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ ఇన్సూరెన్స్, ఇతర బ్యాంకు బకాయిలను పొందేందుకు నామినీలు ఇకపై కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ‘యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ పరేష్ చంద్ర మండల్’ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం శనివారం ఈ తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్ పై పూర్తి వాదనలు విన్న తర్వాత.. నామినీ వివరాలు స్పష్టంగా ఉన్నప్పుడు, ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు కచ్చితంగా “సక్సెషన్ సర్టిఫికెట్ సమర్పించాలని ఒత్తిడి చేయకూడదని కోర్టు ఆదేశించింది.నామినేషన్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమే కుటుంబానికి ఆర్థిక సహాయం త్వరగా అందేలా చూడటమని, కోర్టు సర్టిఫికేట్లు (వారసత్వ ధృవీకరణ పత్రం) అడగడంతో ఆ ఉద్దేశమే దెబ్బతింటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, నామినీకి డబ్బులు అందినంత మాత్రాన వారే పూర్తి యజమాని కారని తెలిపింది. ఇతర చట్టబద్ధమైన వారసులు ఎవరైనా ఉంటే వారు తమ వాటా కోసం నామినీపై సివిల్ కోర్టులో క్లెయిమ్ చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ బాధ్యత కేవలం నామినీకి నిధులు విడుదల చేయడమేనని, ఆ తర్వాత వారసత్వ వివాదాలు ఉంటే అవి సివిల్ చట్టాల ప్రకారం తేల్చుకోవాలని సుప్రీంకోర్టు వివరించింది.

ముఖ్యమైన వివరాలు..

– ఈ తీర్పుతో నామినీ పేరు ఉంటే బ్యాంకులు.. ఇన్సూరెన్స్ కంపెనీలు సక్సెషన్ సర్టిఫికెట్ అడగలేవు.

-కోర్టు నిర్ణయంతో మరణించిన వారి ఆశ్రితులకు డబ్బులు త్వరగా అందుతాయి.

-డబ్బులు నామినీకి అందకపోయినా, చట్టబద్ధమైన వారసులకు వాటి పై హక్కు ఉంటుంది

Leave A Reply

Your email address will not be published.