ముద్ర మల్కాజిగిరి:
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. శనివారం కాప్రా ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగాకార్యక్రమములో భాగంగా కాప్రా సర్కిల్ లో పర్యటించి, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ వర్క్స్ ను పరిశీలించారు.శానిటేషన్ లో భాగంగా అనుపురం కాలనీ ఏరియాలో శానిటేషన్ విషయంలో బాగాలేని ప్రదేశాల విషయమై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటి, వ్యాపార స్థలాలలో చెత్త సేకరణ విషయమై యజమానులు చెత్త కొరకు ఏర్పాటు చేసుకోవలసిన డబ్బాలను స్వచ్ఛ ఆటో వారికి అందించే విషయమై యజమానులను స్వచ్ఛ ఆటో వారిని సంబంధిత ఎస్ఎఫ్ఏ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కందిగూడ డా చౌరస్తాలో గల పార్కును , ఫుట్బాల్ గ్రౌండ్ ను సందర్శించి నిర్మాణంలో ఉన్న పనులను తనిఖీ చేశారు. అనంతరం కుషాయిగూడ డీమార్ట్ వద్ద నిర్మాణంలో ఉన్న ఇంజనీరింగ్ బాక్స్ డ్రైనేజ్ వర్క్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, ఈ. ఈ రమేష్ బాబు, డి. ఈ,బాలకృష్ణ టౌన్ ప్లానింగ్ ఏ.సి.పి కృష్ణమూర్తి, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ సంబంధిత అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు విధి నిర్వహణలో అధికారులందరూ బాధ్యతగా వ్యవహరించాలని అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.