Take a fresh look at your lifestyle.

అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం..

శ్రీ వారిని గరుడ వాహనంఫై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణోత్సవం ఆదివారం ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శరణాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ప్రాతఃకాలంలో అర్చక సుప్రభాత సేవతో నిత్య కైంకర్యాలు చేశారు.
శ్రీ సుదర్శన నారసింహ హవనం, సాయంకాలంలో శ్రీ వారిని గరుడ వాహనం మీద అధిరోహింప చేసి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించి భక్తుల గోవింద నామస్మరణల నడుమ వైభవంగా నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.