Take a fresh look at your lifestyle.

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి సర్పంచ్ సాయిలు బూరుగుపల్లిలో ఇఫ్తార్ విందు

ముద్ర ప్రతినిధి, మెదక్:
మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని బూరుగుపల్లి సర్పంచ్ సాయిలు అన్నారు. హవెలి ఘనపూర్ మండలం బూరుగుపల్లిలో గురువారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సర్పంచ్ సాయిలు ముఖ్యఅతిథిగా ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాలను గౌరవించడం మన ఐక్యతకు నిదర్శనమన్నారు. పవిత్ర రంజాన్ ఉపవాసం ఎంతో ముఖ్యమన్నారు. మైనారిటీ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధన చేసి ఉపవాస దీక్ష విరమణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్యాల శ్రీనివాస్, నర్సింహులు, సాయిబాబా, దుర్గయ్య, లెంక రాజు, లెంక బాబు, సుధాకర్, బిఆర్ఎస్ నాయకులు బాలరాజ్, వెంకట్, ఉప సర్పంచ్ రాజు, వార్డు సభ్యులు రమేష్, సాయిలు, కృష్ణ, సన్నీ, ప్రజాప్రతినిధులు, మత పెద్దలు నాయకులు, కార్యకర్తలు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.