- నష్టపోతున్న రైతులు.
- పట్టించుకోని అధికార యంత్రాంగం.
ముద్ర, మల్యాల,విలేఖరి : రైతుల కష్టం దళారుల పాలవుతోంది. ఆరుగాలం శ్రమించి వరి దాన్యం పండించిన రైతులు ఓ వైపు పంటలను రక్షించుకోవడానికి మరో వైపు వాతావరణం లో మార్పులు ఈదురు గాలులతో సతమతమవుతున్నారు. ఆకాల వర్షం వస్తుందేమోనని భయాందోళనతో దళారుల చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మండలంలోని తక్కల్లపల్లి సింగిల్ విండో కార్యాలయం ఆవరణలో దళారులు కాంటా వేసి దర్జాగా సొమ్ము చేకూర్చుకుంటున్నారు. ఉన్నత అధికారులు పట్టించుకోకపోవడంతో దళారులకు ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరి కొందరు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. వ్యాపారులు నేరుగా రైతుల వద్దకే వచ్చి మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేస్తున్నారు. కొందరు కోతలు కోయగానే నేరుగా ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. క్వింటాల్‌కు 2100 రూపాయలకే అమ్ముకుని నష్టపోతున్నారు. పగలంతా నిప్పుల కొలిమిలా ఎండలు కొడుతుంటే రాత్రి వేళ వాతవారణం చల్లబడుతోంది, ఎప్పుడు వర్షం పడుతుందోననే భయం రైతులను వెంటాడుతోంది. దీంతో ఏం తోచని పరిస్థితుల్లో దళారును ఆశ్రయిస్తున్నారు. ఉన్నత అధికారులు చొరవ చూపి దళారులకు అమ్ముకోకుండా చరవ చూపలని రైతులు కోరుతున్నారు.
