Take a fresh look at your lifestyle.

నేడే “పుర” పోరు….మక్తల్ లోని ఆరో వార్డు లో నిలిచిన పోలింగ్…

 

పేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో పోలింగ్

జిల్లావ్యాప్తంగా 72 వార్డులు 149 పోలింగ్ స్టేషన్లు

900 మంది పోలింగ్ సిబ్బంది… 550 మంది పోలీసులతో ఎన్నిక ల నిర్వహణ

ముద్ర, నారాయణపేట:

నారాయణపేట జిల్లాలోని మక్తల్, కోస్గి, మద్దూర్ నారాయణపేట మున్సిపాలిటీల పరిధిలో నేడు పురపోరు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 72 వార్డులు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు 149 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అలాగే ఎన్నికల విధుల్లో 900 మంది పిఓ, పిఓ ఇతర సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. అలాగే 550 మంది పోలీసులతో ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులకు 96 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలోని మక్తల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోలింగ్ సామాగ్రి పంపిణీ, కౌంటింగ్ కోసం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మద్దూరులో ప్రభుత్వ జూనియర్ కాలేజ్, కోస్గి లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్, నారాయణపేటలో యాదగిరి రోడ్ లోని గురుకుల పాఠశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రంలోనే ఈనెల 13వ తేదీన కౌంటింగ్ కూడా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే 16న చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎంపిక చేతులెత్తే ప్రక్రియ ద్వారా జరుపనున్నారు. అయితే నారాయణపేట జిల్లా కేంద్రంలోని పళ్ళ జింగిడి గడ్డ, శివాజీ నగర్ వీధిలో గల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టారు. నారాయణపేట మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా 101 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 49, మహిళలు 52 మంది ఉన్నారు. ఏదిఏమైనాప్పటికీ నారాయణపేటలో బిజెపి కాంగ్రెస్ కు వద్ద మున్సిపల్ వార్ జరగనుంది. మక్తల్ లో బిజెపి, టిఆర్ఎస్ కు మధ్య, మద్దూరులో టిఆర్ఎస్ కాంగ్రెస్ కు మధ్య, కోస్గిలో కాంగ్రెస్ టిఆర్ఎస్ కు మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది.

 

మక్తల్ లోని ఆరో వార్డు లో నిలిచిన పోలింగ్…

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6 వ వార్డు బిజెపి పార్టీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప మృతి పట్ల అధికారులు ఆరో వార్డు ఎన్నికను వాయిదా వేశారు. మహాదేవప్ప అధికార పార్టీ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషయమై మంత్రి వాకిటి శ్రీహరి ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి మాట్లాడారు. మహాదేవప్ప ఆత్మహత్య విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్ర ఉన్నట్లు రుజువు అవుతే లేదా తన ఫోన్ నుంచి ఎవరికైనా ఫోన్ చేసినట్లు నిరూపణ అయితే చట్టబద్ధంగా తాను శిక్షకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇదే అంశంపై పార్లమెంటులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. నారాయణపేట టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేందర్ రెడ్డి మహాదేవప్ప ఆత్మహత్య ఘటనను ఖండించారు. నిజనిర్ధారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.