Take a fresh look at your lifestyle.

అంగన్వాడీ లో ఘనంగా పోషణ పక్వాడ కార్యక్రమం

మల్యాల, ముద్ర : మండలంలోని ముత్యంపేట (కొండగట్టు) అంగన్వాడీ కేంద్రం లో శుక్రవారం పోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గర్భిణి స్త్రీలు, బాలింత తల్లులకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు.పోషక ఆహార విలువలు, మహిళలకు చిరుధాన్యాల వల్ల అందే పోషక విలువలను వివరించారు. పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి క్లుప్తంగా వివరించారు.ప్రతి ఒక్క మహిళ రాగులు, సజ్జలు, కొర్రలు, మొదలగు త్రుణ ధాన్యాలలో ఐరన్ పిండిపదార్థాలు అధికంగా లభిస్తాయని తెలిపారు.చిరుధాన్యాలను తప్పనిసరిగా మహిళలందరూ స్వీకరించి ఆరోగ్యంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పవిత్ర, అంగన్వాడి టీచర్ మమత, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.