Take a fresh look at your lifestyle.

కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి ఆహ్వానం.. మంత్రి అడ్లూరికి ఆహ్వాన పత్రిక అందజేస్తాం ఆలయ అర్చకులు..

 

ముద్ర న్యూస్, ధర్మపురి:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి పెద్ద జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కొండగట్టు దేవాలయ అర్చకులు ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికను సోమవారం హైదరాబాద్ లో అందజేశారు.

పెద్ద హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించాలని జయంతి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భక్తులకు చలువ పందిళ్ళు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని తక్కువ సమయంలో దర్శనమయ్యే విధంగా ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను మంత్రి ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.