ముద్ర న్యూస్, ధర్మపురి:
ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును సంబంధిత నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. మరో నెల రోజుల్లో వర్షాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట పెద్దపల్లి ఎంపీ తో పాటు నేరెళ్ల సర్పంచ్ బాలగౌడ్, ధర్మపురి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.