Take a fresh look at your lifestyle.

అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది – ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్ బాబు

 

ముద్ర: కాప్రా

ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం సుమారు110 కోట్ల నిధులు కేటాయించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాప్రా ,చర్లపల్లి, మీర్పేట్ హెచ్ పీ కాలనీ, ఉప్పల్ ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మేయర్ విజయలక్ష్మి తో కలిసి శంకుస్థాపన చేశారు. అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గంలో క్రీడా మైదానాలు, ఇండోర్ – ఔట్డోర్ గేమ్స్ కాంప్లెక్స్, స్కూల్ భవనాలు వంటి పలు అభివృద్ధి పనులకు పరలో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాల క్రీడా సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు అతీతంగా ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు స్వర్ణరాజ్ ,ప్రభుదాస్ ,బొంతు శ్రీదేవి తో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.