ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు సి ఎం రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా బాసరకు చేరుకున్న సీఎం దంపతులు, కూతురు, అల్లుడు, మనవడికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు సంజీవ్ మహారాజ్ ముఖ్యమంత్రి మనవడు రియాంశ్ ( రుద్రదేవ్) కు అక్షరాభ్యాసం చేయించారు. కూతురు నైమిష దంపతులతో పాటు మంత్రులు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిసిసి అధ్యక్షుడు వెడ్మా బొజ్జు తదితరులు పాల్గొన్నారు.