Take a fresh look at your lifestyle.

కేసీఆర్ ది సాగు భాష.. రేవంత్ ది చావు భాష 

  • కేసీఆర్ తెలంగాణను నిలబెట్టిండు.
  • రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు .
  • ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి పని అయిపోయింది.
  •  ఢిల్లీలో బీసీ సభకు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి కూడా రాలేదు. 
  • ఈ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి ఆదేశించిందట ఉప ముఖ్యమంత్రి కేసులు ఉపసంహరించుకుంటారట.
  •  రేవంత్ రెడ్డి పెట్టింది తప్పుడు కేసులని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పినట్టే కదా. 
  •  అక్రమ కేసులో పెట్టినందుకు రాష్ట్ర హోం మంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హెచ్ యు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి.
  •  హెచ్ సీయు అడవుల్లోనూ నరికి మూగజీవాల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి.
  •  రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఈగలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. 
  •  సంగారెడ్డి లో మాజీ మంత్రి హరీష్ రావు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని..ప్రస్తుతం ప్రజలంతా తిరిగి బీఆర్ఎస్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో నీళ్ళేవో అర్థం అయిపోయిందన్నారు.సీఎం రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు లేవు అన్నది ప్రజలకు చాలా స్పష్టంగా..చాలా త్వరగా అర్థమమైందన్నారు.ఆయన మాటలను నమ్మి కాంగ్రెస్ ను గెలిపించినందుకు బాధ పడుతున్నారన్నారు.బుధవారం సంగారెడ్డిలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ది సాగు భాష..రేవంత్ ది చావు భాషగా మారిందని ధ్వజమెత్తారు.కేసీఆర్ తెలంగాణను నిలబెడితే..రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు  అని అన్నారు.కేసీఆర్ ఎప్పుడు మాట్లాడిన మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయాలి. ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతులకు నీళ్లు అందించాలని చెప్పే వారన్నారు. కానీ  రేవంత్ రెడ్డి మాట్లాడితే పేగులు మెడలో వేసుకుంటా, తొక్కుతా..చంపుతా తొడలదర కొడతా ఇలాంటి భాష రేవంత్ రెడ్డిదని ధ్వజమెత్తారు.రేవంత్ కు ఇప్పుడు రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలో కూడా లేదన్నారు. ఢిల్లీలో బీసీ సభకు రాహుల్ గాంధీని తీసుకొని వస్తా..పార్లమెంట్లో బిల్లు ఆమోదింప చేస్తా అని అన్నాడని..కానీ ధర్నాకు ఆయన (రాహుల్)ను  తీసుకురాలేకపోయాడన్నారు.అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా  కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.అప్పుడు నో ఎల్ఆర్ఎస్ అన్నారు. ఇప్పుడు  ముక్కుపిండి వసూలు చేస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్ అధికారంలోకి  వస్తే ఫార్మాసిటీ భూములన్ని రైతులకు వాపసిస్తామని అని చెప్పి..ఇప్పుడేమో 16 వేల ఎకరాలు సేకరిస్తున్నారన్నారు.జీవోలు 58, 59 కింద కేవలం ఒక్క పటాన్  చెరువు నియోజకవర్గంలో వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశామన్నారు.కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక 58, 59 జీవోలు బందు పెట్టిండన్నారు. పైసలు కట్టినోళ్లకు కూడా పట్టాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు.రైతుబంధు కేసీఆర్ రూ. 10వేలు ఇస్తుంటే..తాను రూ. 15వేల ఇస్తా అని రేవంత్ గొప్పులు చెప్పిండన్నారు.ఆయన నమ్మి ఓట్లు వేసిన రైతులను పూర్తిగా  అన్యాయం చేసిండన్నారు.  కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక పోయినట్టు అయిన చందంగా రూ. 15వేలు కాదు కదా..కేసీఆర్ ఇచ్చే రూ. 10వేలకు కూడా దిక్కులేకుండా పోయిందన్నారు.రుణమాఫీ అసలు ఇయ్యాల్సింది రూ. 49 వేల కోట్లు అయిచే అసెంబ్లీలో చెప్పింది రూ 31 వేల కోట్లు అని చెప్పి..రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేదని హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో 50 శాతం రైతులకు రుణమాఫీ కూడా కాలేదు..వారికి  రైతుబంధు రాలేదన్నారు. రూ. 4వేల పెన్షన్ లేదు..అక్కచెల్లెళ్లకు మహాలక్ష్మి పెన్షన్ రాలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎన్నికల హామీ ఇవ్వకపోయినా 13 లక్షల పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించారని గుర్తు చేశారు.ఇప్పుడు పెళ్లయి పిల్లలు పుట్టినా కల్యాణ లక్ష్మి చెక్కు లేదు తులం బంగారం పూసే లేదన్నారు.కేసీఆర్ చెట్లు పెడితే,రేవంత్ రెడ్డి వాటిని నరుకుతున్నాడన్నారు.మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి తీసుకొని అక్కడ చెట్లని నరికేసిండని విమర్శించారు.అలాగే  నిన్న హెచ్ సీయు భూముల్లో 400 ఎకరాల అడవుల్లోనూ నరికి మూగజీవుల పాపం కట్టుకున్నాడని మండిపడ్డారు.హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలగొడుతున్నాడని విమర్శించారు.ఈ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి ఆదేశాల మేరకు  హెచ్ యు విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి రెండు రోజుల క్రితం ప్రకటించారన్నారు.అంటే ముఖ్యమంత్రి..హోంమంత్రి రేవంత్ రెడ్డి కేసులు పెడితే..ఉపముఖ్యమంత్రి కేసులు ఉపసంహరించుకుంటాడు అంట అని ఎద్దేవా చేశారు.ఇదేమి రాజ్యం.తోక కుక్క నాడిస్తున్నదా కుక్క తోక నాడిస్తున్నదా అర్థం కావడం లేదన్నారు.రేవంత్ రెడ్డి పెట్టింది తప్పుడు కేసులని.. భట్టి  చెప్పినట్టే కదా అని అన్నారు.వారిపై అక్రమ కేసులో పెట్టినందుకు రాష్ట్ర హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హెచ్ యు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా హరీశ్ రావు డిమాండ్ చేశారు .
  • అంతా ఆగమాగం .
రేవంత్ రెడ్డి పాలన సగం సగం ఆగమాగమన్నారు. ఏది చూసినా సగం సగం అంతా ఆగమాగమని హరీశ్ రావు మండిపడ్డారుయ మూసీ..మూసీ అన్నాడు.మూడు నెల్లూరుకెడు ఎల్లేలుకల పడ్డడన్నారు.హైడ్రా..హైడ్రా అని ఆర్నెల్లు ఉరికిండు..ఇప్పుడు వెల్లకిలబడ్డాడన్నారు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదన్నారు.రేవంత్ పాలన వల్ల రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఈగలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.కాంపౌండ్ లో గిరాకి లేదు,రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఆదాయం లేదన్నారు.కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ పెరుగుడే పెరుగుడు..అయితే రేవంత్ పాలనలో దిగుడే దిగుడన్నారు

Leave A Reply

Your email address will not be published.