ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామస్తులు కాంగ్రెస్‌లో చేరిన ఉప సర్పంచ్ గుద్దేటి నర్సింహ
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారిని ఆయన నివాసంలో వెలిజాల గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వాన పత్రాలు అందజేశారు.
అనంతరం చెన్నారం గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గుద్దేటి నర్సింహ టీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు.

తదుపరి నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు మరియు ఎల్‌ఓసీ పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.