Take a fresh look at your lifestyle.

గద్దర్ ఫిల్మ్ అవార్డ్ జ్యూరీ లో మార్పు స్పెషల్ జ్యూరీ చైర్మన్‌గా తమ్మారెడ్డి భరద్వాజ నియామకం

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 జ్యూరీ కమిటీలో కీలక మార్పు జరిగింది. స్పెషల్ జ్యూరీ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజను నియమించిన తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్… దర్శకుడు రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు గురువారం ఆ కార్పొరేషన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఉగాది సందర్భంగా మార్చి 19న అవార్డులను తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారాలకు ఎంపికైన చిత్రాల స్క్రీనింగ్‌ ఈ నెల ఆరో తేది నుంచే ప్రారంభమైంది. తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని, భారతీయ సినీ రంగానికి హైదరాబాద్ ను కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది.

Leave A Reply

Your email address will not be published.