Take a fresh look at your lifestyle.

సమస్యల పరిష్కారానికి TGEJAC ఆధ్వర్యంలో నిరసన నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు ఆందోళన

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ (TGEJAC) పిలుపు మేరకు శుక్రవారం నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నాన్-గెజిటెడ్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా వేతన సవరణ (PRC), పెండింగ్ బిల్లుల చెల్లింపు, కాష్‌లెస్ హెల్త్ కార్డుల అమలు, సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు వంటి ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ సిబ్బందితో పాటు ప్రశాంత ఉద్యోగుల సంఘ నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, పోల శ్రీనివాసులు, నరసయ్య, బాలస్వామి, లక్ష్మీకాంతరావు, శ్రీనివాసులు, పాండురంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.