Take a fresh look at your lifestyle.

ఎస్ఆర్ఎస్పి కెనాల్ భూమి కబ్జా …

రంగంలోకి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
కెనాల్ భూమి హద్దులు నిర్ణయించిన రూరల్ తహసీల్దార్ హకీమ్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో గల SRSP కెనాల్ నర్సింగాపూర్ డబుల్ బెడ్ రూముల నుండి నర్సింగాపూర్ గేట్లు వరకు SRSP కెనాల్ భూమిని కొందరు కబ్జా చేశారు. అయితే ఈ భూ కబ్జాపై పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో బుధవారం గ్రామ సర్పంచ్ వంశీ, గ్రామస్తుల సహాకారంతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వ SRSP భూమిని పరిశీలించారు. అనంతరం కెనాల్ భూమి హద్దులు నిర్ణయించినట్లూ జగిత్యాల రూరల్ మండలం తహసీల్దార్ సాదాబ్ హకీమ్, ఇరిగేషన్ అధికారి DE ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింగాపూర్ గ్రామ సర్పంచి కుక్కునూరి వంశీ, నర్సింగాపూర్ IKP సిబ్బంది సభ్యులు, గిర్ధవార్లు చిట్యాల భూమయ్య , శ్యామ్షోద్దీన్, GPO శ్రీనివాస్ , నర్సయ్య, SRSP ఇరిగేషన్ అధికారులు, లష్కర్ లు ఫాల్గొన్నారు. ఈ SRSP భూమిని గ్రామ అవసరాల నిమిత్తం IKP సెంటర్ గ్రామ అవసరాలకు వినియోగించుకోవాలని జగిత్యాల రూరల్ తహసీల్దార్ సాదాబ్ హకీమ్ సూచించినారు.

Leave A Reply

Your email address will not be published.