CITU జిల్లా సహాయ కార్యదర్శి,పబ్లిక్ ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి
కరీంనగర్ జిల్లా ఏసియన్ పెయింట్ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు ఈరోజు సమ్మె 5వ రోజు శాంతియుతంగా సమ్మె జరుగుతుంది సమ్మెను ఉద్దేశించి పబ్లిక్ ప్రైవేటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి మాట్లాడుతూ…. ఏసియన్ పెయింట్ గోదాం లో 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్న డ్రైవర్ల పొట్ట కొడుతున్న యాజమాన్యం వెంకట్ లాజిస్టిక్ భూషణం ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అట్లాగే ట్రాన్స్పోర్టు యజమానికి వాహనాల యొక్క ఓనర్లు డ్రైవర్ల కు అగ్రిమెంటు లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు, వీరి యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సిఐటియు అండగా ఉంటుందని, వారి సమస్యల పట్ల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిరసన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు, లేబర్ ఆఫీసు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేపడతామని తెలిపారు , యజమాన్యం పోలీసులతో నిర్బంధించాలని బయట వాహనాలను అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని డ్రైవర్లను యూనియన్ నాయకులను బెదిరింపులకు పాల్పడుతున్నారు, అసలు ఇక్కడ జరుగుతున్న సమ్మెకు పోలీసుల జోక్యం ఏమిటని ప్రశ్నించారు ఒక్కో వాహనంపై 2800 ట్రాన్స్పోర్టు ఏజెన్సీలు తీసుకొని లాభాలు దండుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు,
యూనియన్ అధ్యక్షులు కామల్ల మహిపాల్ మాట్లాడుతూ… ఏషియన్ పెయింట్ గోదాములో 60 మంది డ్రైవర్లు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్న ఎటువంటి హమాలీ చార్జీలు చెల్లించక లేకపోవడం గోదాం మేనేజరు విజేందర్ రెడ్డి కి నాలుగు సంవత్సరాల నుండి మా బాధలు చెబుతున్న పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు, మేము పగలు రాత్రి అనక నిత్యం రోడ్డుపైన వాహనాలు నడుపుతూ అనుకోకుండా ప్రమాదం జరిగితే మా కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయని ,డీలర్ షిప్ యజమాని ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. డ్రైవర్లకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి కీసర మల్లేశం, కోశాధికారి ఉత్తమల్ల వెంకటేశ్ , ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి మూగ తిరుపతి,లారీ డ్రైవర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు ఎండి .ఆరిఫ్ మొయినొద్దిన్, ప్రధాన కార్యదర్శి ఎలుక పెళ్లి రమేష్, కోశాధికారి సముద్రాల రాజకుమార్ ,ఉపాధ్యక్షుడు షకీల్ అహ్మద్ హుస్సేన్, దమ్మక్కల నారాయణ, సహ కార్యదర్శి ఎం డి అమీన్ ,జలీల్, భాయ్, రాజు , నజీర్ ఖాన్, వహీద్, సల్లు, జహంగీర్ ALT మదనయ్య , శర్మ ,అజయ్ తదితరులు పాల్గొన్నారు