Take a fresh look at your lifestyle.

సేవ్ బర్డ్స్- రైతు నేస్తానికి ముప్పు

– కనుమరుగవుతున్న పిచ్చుకలు
– సంరక్షణకు నడుంకట్టిన అనంతుల రమేష్

– మార్చి 20 న ప్రపంచ పిచుకల దినోత్సవం

ముద్ర, కరీంనగర్ : వాతావరణ మార్పులు పిచ్చుకలపై బ్రహ్మస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. తెలతెలవారుతుండగా ఒకప్పుడు పక్షుల కిలకిలరావాలు పల్లెసీమలను అలరించేవి. పొలాల్లో పురుగుపుట్రా తింటూ రైతుకు ఎంతో మేలు చేసేవి. శరవేగంగా మారుతున్న పట్టణీకరణ, సెల్‌టవర్ల తరంగాలు, పొలాల్లో విషపూరిత పురుగుమందుల వాడకం పక్షుల మనుగడకు ప్రతికూలంగా పరిణమించింది. పిచ్చుకలైతే దాదాపు అంతరించిపోతున్నాయి. ఈ తరుణంలో పిచ్చుకల సంరక్షణ కోసం నడుంకట్టాడు….కరీంనగర్ కిసాన్ నగర్ కు చెందిన అనంతుల రమేష్ . తన ఇంటి ఆవరణాన్ని పిచ్చుకలకు ఆవాసంగా మార్చారు.. పిచ్చుకల కోసం ఇంటి ఆవరణంలో కృత్రిమ గుళ్ళు, తినడానికి గింజలు, ఇంటి చుట్టు మట్టి చిప్పల్లో నీళ్లు ఇంటి చుట్టూ పచ్చని చెట్లు ఉండడంతో . వందలాది పిచ్చుకలు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన గూళ్ళ ఏర్పాటు చేసుకుని, గుడ్లు పెట్టి.. సంతానోత్పత్తి చేస్తున్నాయి. ఉదయం గుంపులు గుంపులుగా వచ్చే పక్షులు కిల కిల రావాలతో ఇంటిల్లి పాది నిద్ర లేస్తారు..అక్కడికి వచ్చే పక్షులను చూడడానికి స్కూలుకు వెళ్లి చిన్న పిల్లలు చుట్టుపక్కల వారు వచ్చి పక్షుల కిలకిల రావాలని చూస్తూ ఆనందిస్తారు..

 

 

Leave A Reply

Your email address will not be published.