Take a fresh look at your lifestyle.

సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన సదస్సు: ఎస్ ఐ చిర్ర సతీష్

గొల్లపల్లి, ముద్ర: జగిత్యాల జిల్లా లోని గొల్లపల్లి  మండలం రాఘవపట్నం గ్రామంలో గురువారం స్థానిక ఎస్ ఐ చిర్ర సతీష్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కళాబృందం వారుచే సామజిక అంశాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ.ఈ మధ్యకాలం లో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి  మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్టైతే  1930 నంబర్ కి పిర్యాదు చేయాలని, అన్ని గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు,తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అన్నారు.యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని,ప్రభుత్వం ,పోలీస్ తరపున అన్ని విధాల సహాయహకారులు ఉంటాయని అన్నారు. వాహన దారులు తాగి డ్రైవింగ్, లైసెన్స్  లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు.గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్న పోలీస్ స్టేషన్ కు తెలియజేయలని ఆయన అన్నారు. గ్రామంలో చిన్న చిన్న తగాదాలకు పోయి జీవితం నాశనము చేసుకొవద్దని, నేరరహిత గ్రామాలుగ చేయడానికి ప్రజలు కృషి చేయాలనీ సూచించారు.మంత్రాలు ముడనమ్మకాలు నమ్మవద్దని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఐ చిర్ర సతీష్,కానిస్టేబుల్ తిరుపతి,పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.