Take a fresh look at your lifestyle.

వీధి వ్యాపారులకు మున్సిపాలిటీ సూచన – అదనపు వసూళ్లపై ఫిర్యాదు చేయండి మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి

 

నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి:

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని వీధి వ్యాపారులకు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ముఖ్య సూచనలు జారీ చేశారు. తై బజార్ వసూళ్లకు సంబంధించి వివిధ రకాల వ్యాపారాలకు నిర్ణయించిన రేట్ల ప్రకారం కాంట్రాక్టర్‌కు మున్సిపాలిటీ నుండి వర్క్ ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ నిర్ణయించిన రేట్లకు మించి అదనంగా వసూలు చేసినట్లయితే, వెంటనే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యాపారులు తమ హక్కులను కాపాడుకునేందుకు నిర్భయంగా ముందుకు రావాలని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలు లేదా ఫిర్యాదుల కోసం మున్సిపల్ మేనేజర్ జె. వెంకటయ్యను 94906 02747 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.