రామకృష్ణాపూర్, ముద్ర : వక్ఫ్ బిల్లును పార్లమెంటులో ఆమోదించడంపై పట్టణ బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తాజా బిల్లుతో అట్టడుగునా ఉండిపోయిన వర్గాలకు మేలు జరుగుతుందని పట్టణ అధ్యక్షుడు ఠాకూర్ ధన్ సింగ్ అన్నారు. శుక్రవారం స్థానిక సూపర్ బజార్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోషం,అశోక్,సీనియర్ నాయకులువేణు,ఈశ్వరచారి,శ్రీనివాస్,సరస్వతి తదితరులు పాల్గొన్నారు.