తెలంగాణ రాష్ట్ర సాధకుడు బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ క్యాంప్ కార్యాలయం పై కాంగ్రెస్ శ్రేణుల దాడులను ఖండిస్తున్నాం
ముద్ర ,తుంగతుర్తి…
తెలంగాణ రాష్ట్ర సాధకుడుతెలంగాణ తొలి ముఖ్యమంత్రి, గజ్వేల్ శాసనసభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నా మనీ సూర్యాపేట జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకపక్క ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరలించేందుకు కాంగ్రెస్ నాయకులు ఇలాంటి చౌకబారు పనులకు పాల్పడడం హేయమైన చర్య అని అన్నారు. ప్రజా రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ కాలం గడుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ర్టాన్ని రావణకాష్టంలా మార్చుతున్నాడనీ అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయంపైనే దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. శాంతి భద్రతలు కేసీఆర్ పాలనలో ఏ విధంగా ఉండేవో నేటి కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా ఉందో జరుగుతున్న సంఘటనలు బట్టి చెప్పవచ్చని అన్నారు. పోలీసులు ప్రజల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సింది పోయి , అధికార కాంగ్రెస్ నాయకులకు కొమ్ముకాయడం విడ్డూరం గా ఉందని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని రానున్న కాలంలో తిరిగి కెసిఆర్ సారధ్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. అరాచక వాదులకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న బి ఆర్ ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఇలాంటి చిల్లర పనులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రానున్న కాలంలో రాష్ట్ర ప్రజలు తగిన సమయంలో తగిన రీతిలో కాంగ్రెస్ పాలకులకు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.