ముద్ర తుంగతుర్తి:
మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో వడ్లు పొయ్యొద్దంటూ క్రీడాకారులు, యువకులు శనివారం తహశీల్దార్ దయానందంకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ మినీ స్టేడియంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో మార్నింగ్ వాకర్స్, ఈవినింగ్ వాకర్స్ లకు ఇబ్బందికరంగా ఉందని వారు తెలిపారు. ప్రతిసారి మినీ స్టేడియంలో వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వాహకులు నిర్లక్ష్యంగా గ్రౌండ్లో మొత్తం ఇసుకరాళ్లు, చెత్తాచెదారంతో వదిలేసి వెళ్ళిపోతున్నారని దీంతో క్రీడలకు ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. వినతిపత్రం అందించిన వారిలో మడూరి రమేష్, ఉప్పుల రాంబాబు, ఎల్లబోయిన శ్రీకాంత్, భాష, జవాజి నాగరాజు, ఆంజనేయులు, తాడూరి సైదులు తదితరులున్నారు.
