Take a fresh look at your lifestyle.

గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు

  • పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు.

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: గత ప్రభుత్వంలో ప్రజలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని, ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ల చెప్పులు అరిగి అలిసిపోయారే తప్ప వారికి ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు.పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్స్ లో పెద్దపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా 4847 మంది నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలం తర్వాత ప్రజా ప్రభుత్వం రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 4,847 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని అందులో అనుసంధానం చేస్తూ 24 వేల 770 మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. అలాగే గతంలో ఉన్న రేషన్ కార్డులలో 10 వేల 715 మంది సభ్యులను జత చేయడం జరిగిందని, దీనితో నియోజకవర్గంలో మొత్తం 35 వేల 485 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. అలాగే 3 వేల 289 రేషన్ కార్డు దరఖాస్తులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. కారు, ట్రాక్టర్ ఉందని రేషన్ కార్డు కోత పెట్టవద్దని, వారి ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని రేషన్ కార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. గత టిఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ సంక్షేమ పథకాలు అమలు చేసిందని విమర్శించారు కాని ఎన్నికలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు. ప్రజలు ఘటక తినే కాలంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలోని 29 రాష్ట్రాలలో, సన్నబియ్యం ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులను, ప్రస్తుతం కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం తొలగిస్తూ వస్తుందని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూరాలంటే మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని అన్నారు.అలాగే పెద్దపల్లి కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు గారు, మరియు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్లు మరియు డిఎస్ఓ, నియోజకవర్గంలోని పలువురు తహశీల్దార్లు మరియు పలు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.