మాదాపూర్, ముద్ర విలేఖరి : పీయేసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని పలు డివిజన్ లలో శంకుస్థాపనలు, ప్రారంభిస్తవాలు చేశారు.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1, 2, తులసి నగర్, శ్రీ తులసి నగర్, కాకతీయ నగర్, చంద్రమ్మ బస్తి, పంచమి కాలనీ, ఉజ్జయిని మహంకాళి నగర్ కాలనీలలో రూ. 2 కోట్ల 8 లక్షల 50 వేల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణము పనులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జల వాయ్ విహార్, రాంనరేశ్ నగర్, అల్లపూర్ సొసైటీ, మైనారిటీ స్కూల్, విజేత గ్రీన్ హోమ్స్, కింది కుంట చెరువు నుండి కోన సీమ వంటిల్లు,హెచ్.ఏం. టి శాతవాహన నగర్ కాలనీలలో రూ. 2 కోట్ల 9 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణము పనులకు మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రశాంత్ హిల్స్ కాలనీ లో గల కుమ్మరి కుంట చెరువు సుందరికరణ లో భాగంగా ప్రశాంత్ హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి మొక్కను నాటిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ కార్యక్రమంలో ప్రశాంత్ హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జగదీష్, శేఖర్ రెడ్డి, ప్రభాకర్ , రాజు, పద్మ ,అమర్ మరియు ఇతర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
