Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ సభ సక్సెస్ అవుతుంది

  • కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారు.
  • ఆయన మాట్లాడతారోనని జనం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
  • స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్​ లో తప్పేం లేదే.
  • ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ నెల 27న వరంగల్​ లో జరగనున్న బీఆర్​ఎస్​ సిల్వర్ జూబ్లీ మహాసభ విజయవంతం అవుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జోస్యం చెప్పారు. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ఏమి మాట్లాడతారన్న విషయం పై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.సభకు కూడా జనం బాగా వస్తారని తాను కూడా అనుకుంటున్నానని తెలిపారు.గురువారం హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో నారాయణగూడ కమ్యూనిటీ హల్ లో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని దానం వెల్లడించారు.ఆమె రీట్వీట్ చేసిన విషయాల్లో తప్పేమీ లేదని, ఆమె అక్కడి వాస్తవ పరిస్థితినే ప్రజలతో పంచుకున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్టు ట్వీట్​ చేయలేదని చెప్పారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్​శి శాంతి కుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ కావడం తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు.శాంతకుమారికి మంచి అధికారిగా పేరు ఉందని చెప్పారు.కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని వెల్లడించారు.కాగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్‌పై దానం నాగేందర్ చేసిన అనుకూల వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి.మళ్లీ దానం బీఆర్ఎస్‌లోకి వెళ్తారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Leave A Reply

Your email address will not be published.