ముద్ర, తెలంగాణ బ్యూరో : ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెళ్ళి కాని జంటలకు రూమ్స్ ఇవ్వబోమని ఓయో తేల్చిచెప్పింది. ఈమేరకు చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులను తీసుకొచ్చింది. ఇకపై పెళ్లి కాని యువతీ, యువకులు ఓయో రూమ్స్ లో చెక్ ఇన్ చేసేటప్పుడు వారి రిలేషన్షిప్‌కు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్స్ అడగనుంది. సరైన ఐడీ ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్‌ను తిరస్కరించే అధికారాన్ని పార్టనర్ హోటల్స్‌కు ఇస్తున్నట్టు ఓయో పేర్కొంది.