Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్, భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, లావుడియ రాజు మాట్లాడుతూ ఫీజు బకాయిలపై  హైకోర్టు తీర్పు పేద విద్యార్ధులు చదువులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఫీజుల కోసం విద్యార్ధులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదాన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. భువనగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఏయిడెడ్ కళాశాల ఉండగా ఈ కళాశాలను ప్రభుత్వమే తన ఆధీనంలో తీసుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఇర్ల రాహుల్, తీగుళ్ల శ్రీనివాస్, దరావత్ జగన్నాథ్, పుట్టల ఉదయ్, జిల్లా కమిటీ సభ్యులు ఈర్ల కార్తీక్, బుగ్గ ఉదయ్, మైసూర్ల నరేందర్ దాసరి ప్రకాష్, ప్రవీణ్,  రోహిత్, ఉదయ్, చరణ్,శివ,అరవింద్, శివ,సాయి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.