Take a fresh look at your lifestyle.

సిపిఎం సీనియర్ నాయకులు నల్ల బుచ్చిరెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు

ముద్ర, చిట్యాల :

మండలంలోని బొంగోని చెర్వు గ్రామ సిపిఎం సీనియర్ నాయకులు నల్ల బుచ్చిరెడ్డి( 70) అనారోగ్యం కారణంగా మరణించడం పట్ల ఆ పార్టీ నాయకులు బొంతల చంద్రారెడ్డి, జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, అరూరి శ్రీనులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం సభ్యుడిగా, చిట్యాల సామిల్ వర్కర్స్ యూనియన్ ( సిఐటియు) నాయకులుగా చాలా కాలం సేవలందించిన బుచ్చి రెడ్డి సేవలు మరువలేనివి అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. బుచ్చిరెడ్డి మృతదేహం పై ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పార్టీ మండల కమిటీ సభ్యులు నెలికంటి నర్సింహా, పంది నరేష్, అరూరి శంభయ్య, సుర్కంటి బుచ్చి రెడ్డి, యంపళ్ళ లచ్చిరెడ్డి, కందాటి మల్లారెడ్డి, యాదిరెడ్డి, సత్తిరెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.