Take a fresh look at your lifestyle.

వంటగ్యాస్ అక్రమ నిలువలపై కొరడా

ముద్ర ప్రతినిధి, మెదక్:
నర్సాపూర్ పట్టణంలో గ్యాస్ ఏజెన్సీపై
రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లైస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్యాస్ ఏజెన్సీ ద్వారా ప్రజలకు సరఫరా చేయవలసిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను ఏజెన్సీ గోదాం నుండి సరఫరా చేయకుండా, ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచి అనధికారికంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా అక్రమ చర్యగా పరిగణలోకి తీసుకున్నామని డిసిఎస్ఓ నిత్యానంద్ తెలిపారు.
ఈ వ్యవహారంపై సివిల్ సప్లైస్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంబంధిత సాహితీ గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు చేశారు. అక్రమ నిల్వలు, అనధికారిక విక్రయాలు మరెక్కడైనా జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపడతాము. ఎవరైనా గ్యాస్ సిలిండర్లను ఇళ్లలో నిల్వ ఉంచి అక్రమంగా విక్రయించినట్లయితే తప్పనిసరిగా కేసులు నమోదు చేసి, కఠిన శిక్షలు అమలు చేసి, అవసరమైతే లైసెన్స్ రద్దు చేసే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.