Take a fresh look at your lifestyle.

చండీగఢ్‌ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ఈనెల 26న “చింతన్ శివిర్” లో పాల్గొన్న మంత్రి అడ్లూరి..

 

ముద్ర,ధర్మపురి:

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల మరియు ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ నెల 25న చండీగఢ్‌ కు వెళ్లనున్నారు.

కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26న నిర్వహించనున్న “చింతన్ శివిర్” కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. ఈనెల 25వ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాత్రి 7-30 గంటలకు మంత్రి బయలుదేేరి రాత్రి 10:15 గంటలకు చండీగఢ్‌లోని షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సంక్షేమ శాఖ మంత్రులతో పాటు న్యాయ శాఖ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం తరఫున రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ “చింతన్ శివిర్” కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మంత్రి వివరించనున్నారు. మంత్రి పర్యటన దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చండీగఢ్ ప్రభుత్వానికి మరియు సంబంధిత అధికారులకు సమాచారాన్ని అందజేశారు. చండీగఢ్ పర్యాటక ముగించుకొని ఈనెల 28వ తేదీన తిరిగి మంత్రి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్ చేరుకుంటారు.

Leave A Reply

Your email address will not be published.