ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : కల్వకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో కలిసి శుక్రవారం భూమి పూజ చేశారు. వెల్దండ నుండి శిరసనగండ్ల వరకు రూ.40కోట్లతో నిర్మించే బీటీ రోడ్డుకు భూమి పూజా చేశారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.