ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రజావాణిని మరింత పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రస్థాయి ప్రజావాణి ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ రాకేష్ రెడ్డి ఆదేశించారు. డివిజన్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సందర్శించారు.
అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతిమా సింగ్ తో ప్రజావాణి బలోపేతంపై సమావేశం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమానికి మరిన్ని కౌంటర్లు పెంచాలని, ప్రజావాణిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేయాలని అధికారులకు సూచించారు.
ప్రతి దరఖాస్తును అధికారులు వ్యక్తి గతంగా పరిశీలించాలని, సంబంధిత శాఖలకు వెంటనే ఎండార్స్మెంట్ చేయాలన్నారు. ప్రజలకు సమయపాలనతో సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అందిన ప్రతి దరఖాస్తును ప్రజావాణి పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తు దరఖాస్తుదారునికి రశీదు అందజేయాలని, తద్వారా సమస్యల పరిష్కారం పట్ల పారదర్శకత నెలకొల్పాలని ఆదేశించారు. అదేవిధంగా, దరఖాస్తు పరిష్కారానికి సంబంధించి శాఖల అధికారులు తీసుకున్న చర్యల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి వినతిని ప్రాధాన్యంగా తీసుకుని, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పరిష్కారంలో ఆలస్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి ప్రజావాణి అధికారి శృతి నాయక్, అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, డిఆర్డిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.