Take a fresh look at your lifestyle.

శేరిలింగంపల్లిలో రూ.16.12 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అరికెపూడి

  • కొండాపూర్, లింగంపల్లి డివిజన్లలో కార్యక్రమాలు.

మాదాపూర్, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్లలోని పలు కాలనీల్లో రూ.16.12 కోట్లతో అభివృద్ధి పనులకు పీయేసీ ఛైర్మన్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కార్పోరేటర్లు రాగం నాగేందర్, హామీద్ పటేల్ తో కలిసి శంకుస్థాపనలు చేశారు.శేరిలింగంపల్లి డివిజన్ లో 8 కోట్ల 06 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయగా, కోండాపూర్ డివిజన్ లోనూ 8 కోట్ల 06 లక్షల రూపాయలతో సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీ రూ.50.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు, పాపిరెడ్డి నగర్ కాలనీ లో సబ్ స్టేషన్ రోడ్డు వద్ద రూ.100.00 లక్షల రూపాయల అంచనా వ్యయం, రాజీవ్ గృహ కల్ప కాలనీ లో రూ.51.00 లక్షల రూపాయలు, మసీదు బండ విలేజ్ లో రూ.30.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపనలు చేశారు. కొండాపూర్ డివిజన్ లో క్యామ్లెట్ లే ఔట్ కాలనీ రూ.32.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు, మాధవ హిల్స్ కాలనీ రూ42.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీ సీ రోడ్లు, గోల్డెన్ తులిప్ కాలనీ రూ51.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీ సీ రోడ్లు, రాజరాజేశ్వరి కాలనీ రూ51.00 లక్షలు, మార్తాండ్ నగర్ కాలనీ రూ 30.00 లక్షలు, హనీఫ్ కాలనీ రూ 34.00 లక్షల రూపాయల అంచనా, ప్రేమ్ నగర్ A బ్లాక్ కాలనీ రూ 35.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపనలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.