Take a fresh look at your lifestyle.

ఉదండాపూర్ భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 

 

 

ముద్ర, ఉమ్మడి 

మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: 

……………………………………..

 

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా ఉద్ధాండాపూర్ వద్ద నిర్మిస్తున్న జలశయం లో భూ లు కోల్పోయిన రైతులకు పరహారం అందించే విషయం లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో ఉద్ధాండాపూర్ భూ నిర్వవాసితుల సమస్య లు, జడ్చర్ల మిషన్ భగీరథ నీటి సరఫరాపై అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా తో పాటు ఎమ్మెల్యే హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో కలిసి భూనిర్వాసితులకు అందాల్సిన పునరావాసం, పరిహారం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్ ఆర్ ప్యాకేజ్‌లో విడుదలైన నిధులు అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భూనిర్వాసితుల సమస్యలను సానుభూతితో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. జడ్చర్ల నియోజకవర్గంలోని మిషన్ భగీరథ నీటి సరఫరా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. గ్రామాలు, తండాలు, కాలనీలకు తాగునీటి సరఫరా నిరంతరాయంగా అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా పైప్‌లైన్ సమస్యలు, మోటార్ లోపాలు లేదా నీటి సరఫరాలో అంతరాయం ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధికి  నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి  అన్నారు.ఈ సమావేశం లో నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.