ముద్ర ప్రతినిధి,గోదావరిఖని: గోదావరిఖని ఇల్లందు క్లబ్ లోని డైరెక్టర్ క్యాంప్ కార్యాలయం లో బుధవారం సాయంత్రం సింగరేణి బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆపరేషన్ సి ఎల్ వి సూర్యనారాయణ ని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి కంపెనీ అభివృద్ధికి పాటుపడి ఉన్నత లక్ష్యాలని ఉత్పాదకను పెంచాలని కోరారు.ఈ కార్యక్రమానికి చీఫ్ అడ్వైజర్ చిలుక శ్రీనివాస్, ప్రెసిడెంట్ వసంత్ కుమార్, జనరల్ సెక్రెటరీ దేవా చారి,ట్రెజరర్ దేవులపల్లి రాజేందర్, వైస్ ప్రెసిడెంట్ మండ రమేష్,పెంచాల తిరుపతి జాయింట్ సెక్రెటరీ,మధు బాబు,కడారి కుమారస్వామి,నవీన్,సదానందం ఇతర నాయకులు పాల్గొన్నారు.