ముద్ర కూకట్‌పల్లి :
వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సమాచారం ఇకపై భక్తులకు వేలిముద్రల మీద అందుబాటులో ఉండనుంది. ఆలయ ప్రధాన అర్చకులు కోసూరి రామకృష్ణమాచార్యుల పర్యవేక్షణలో, పాలక మండలి మరియు భక్తుల సహకారంతో రూపొందించిన నూతన వెబ్‌సైట్‌ను కాలనీ గౌరవ అధ్యక్షులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గురువారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆలయ వివరాలను డిజిటలైజ్ చేయడం అభినందనీయమన్నారు.
నిత్య కైంకర్యాలు, ప్రత్యేక సేవల సమయాలు.ఆలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు, పండుగల తేదీలు.భక్తులు ఇంటి నుండే సేవలను బుక్ చేసుకునే వెసులుబాటు. ఆలయ అభివృద్ధికి విరాళాలు అందించేందుకు సురక్షితమైన ఆన్‌లైన్ మార్గం.దేశ విదేశాల్లో ఉన్న భక్తులు సైతం ఈ వెబ్‌సైట్ ద్వారా స్వామివారి కార్యక్రమాలను వీక్షించవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు కాలనీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.