ముద్ర ప్రతినిధి, మహబూబ్నగర్: ఛత్రపతి శివాజీ మహారాజ్ స్పూర్తి ప్రదాత అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా హిందూ వాహిని, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ శోభాయాత్ర కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . అనంతరం శోభాయాత్రకు ముస్తాబైన ప్రత్యేక వాహనంలో చత్రపతి శివాజీ విగ్రహం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ చూపిన బాటలో మనందరం నడుద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కురుమన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, యాదిరెడ్డి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిథున్ రెడ్డి, విశ్వనాథ్ బండేకర్ , అజ్మత్ అలి, రాజు గౌడ్, మోయీజ్, ఇమ్రాన్ ఖురేషీ, అభిలాష్ , సందీప్, గురు రాజ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
