రెడ్ క్రాస్ భవన నిర్మాణానికి స్థల వితరణ -రూ.10 లక్షల ప్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసిన ఎన్నారై నారాయణ దంపతులు
ముద్ర,మోత్కూర్:
ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ మోత్కూర్ శాఖ భవన నిర్మాణానికి ఎస్ బి ఐ బ్యాంక్ వెనక శ్రీ భక్త మార్కండేయ ఆలయ సమీపంలో సుమారు రూ.10 లక్షల విలువ గల 104 గజాల తన సొంత స్థలాన్ని ఎన్నారై పోచం నారాయణ, హేమలత దంపతులు శనివారం రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ పత్రాలు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి, మోత్కూర్ శాఖ అధ్యక్షులు ఓ సత్య నాథ్ లకు స్వయంగా అందజేశారు. రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలలో తాను భాగస్వామి కావాలనే ఉద్దేశ్యంతో స్థలాన్ని వితరణగా ఇచ్చినట్లు తెలిపారు. భవన నిర్మాణం కోసం స్థలాన్ని ఇచ్చిన దాత నారాయణ దంపతులను జిల్లా చైర్మన్ లక్ష్మి నర్సింహారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మోత్కూర్ రెడ్ క్రాస్ శాఖ తరపున దాతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ సభ్యుడు ఎం డి అహ్మద్ ఉన్నారు.