ఏప్రిల్ 23, 24 ,25 తేదీలలో కొత్తగూడెంలో జరిగే తెలంగాణ రైతు సంఘం 3వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి : రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్
ముద్ర, బీబీనగర్ :
కొత్తగూడెంలో జరిగే తెలంగాణ రైతు సంఘం 3వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని
రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం
బీబీనగర్ మండలం జమీలాపేట గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 23, 24, 25 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోజరిగే 3వరాష్ట్ర మహాసభ ల పోస్టర్ ను ఆయన ఆవిష్కరణ చేశారు. కొత్తగూడెం పట్టణంలో జరిగే మూడు రోజుల మహాసభలకు ఆల్ ఇండియా కిసాన్ సభ అఖిల భారత అధ్యక్షులు అశోక్ ధావలే ,ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ తోపాటు జాతీయ రాష్ట్ర రైతు ఉద్యమ నాయకులు పాల్గొనే ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపుచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు రేసు రామచంద్రారెడ్డి, కడారి బిక్షపతి, మరిపడిగ ఆంజనేయులు, కొలిచలమ కృష్ణ, కాట్రోత్ బాలు నాయక్, గాడి ఆంజనేయులు, బోనాల పెంటయ్య, రామిడి బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.