ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి.
తారా ప్రభుత్వ కళాశాల,సంగారెడ్డి ఎన్ఎస్ఎస్ విభాగాలు రెండు మూడు మరియు నాలుగుల ఆధ్వర్యంలో దత్తత గ్రామాలైన కల్పగుర్, అంగడిపేట్ మరియు మల్కాపూర్ గ్రామాలలో ప్రత్యేక శీతాకాల శిబిరాలలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపినారు.
కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సహకారముతో కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగాలు దత్తత గ్రామాలలో ప్రజలకు వివిధ అంశాలపై ర్యాలీల ద్వారా అవగాహనను కల్పిస్తున్నారని తెలిపినారు .అదే విధంగా కళాశాల వాలంటీర్లకు ట్రాఫిక్ నిబంధనలపై, సైబర్ క్రైమ్ మరియు ఫోక్ సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపినారు.
ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ట్రాఫిక్ ఎస్ఐలు సాయిలు, రాములు మరియు గోప్యాచవాన్ మాట్లాడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ ని పాటించాలని, ట్రిపుల్ రైడ్ చేయడం నేరమని, వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఓవర్టేక్ చేయరాదని, వాహనదారులు హెల్మెట్ ను లైసెన్సును, నంబర్ ప్లేట్ ను, ఇన్సూరెన్స్ను, పొల్యూషన్ చెకప్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపినారు. లైసెన్స్ లేకుండా మరియు తాగి వాహనాలను నడపరాదని, అట్టి వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిపినారు అదేవిధంగా తెలియని వ్యక్తుల నుండి వచ్చిన మెసేజ్లను ఓపెన్ చేయరాదని, తెలియని వ్యక్తులు ఓటీపీ అడిగినప్పుడు చెప్పరాదని, మన సెల్ ఫోన్లు జాగ్రత్తగా ఉపయోగించాలని, ఎట్టి పరిస్థితులలోనూ అపరిచిన వ్యక్తులకు సమాధానాలు ఇవ్వరాదని, అపరిచిత వ్యక్తుల చేతుల్లో సెల్ఫోన్లు పెట్టరాదని తెలిపినారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే అట్టి వ్యక్తులు 24 గంటల లోపు 1930 కు కాల్ చేస్తే వారు పోగొట్టుకున్న డబ్బును పోలీస్ డిపార్ట్మెంటు రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపినారు. అదేవిధంగా 18 సంవత్సరాల లోపు బాలికలను ఏ విధంగా వేధించరాదని, వారి తల్లిదండ్రులకు సమాచారం లేకుండా వారిని మనము ఎక్కడికి తీసుకొని పోరాదని, అది ఫోక్ షో చట్టం కిందికి, వస్తుందని లైంగికంగా వేధించిన, బాలికలను ఏ రకంగా ఇబ్బంది పెట్టిన ఫోక్సో చట్టం ప్రకారము నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటుందని, కఠినమైన జైలు శిక్ష ఉంటుందని, బాలికల విషయములో యువత జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
అదే విధంగా వాహనదారుల ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించనప్పుడు ఏ విధంగా ట్యాప్ ద్వారా వారికి ఫైన్ వేయబడుతుందో, అదే విధంగా త్రాగి వాహనాన్ని నడిపితే నూతన పరికరం ఏ విధంగా పనిచేస్తుందో ప్రయోగపూర్వకంగా విద్యార్థులకు వివరించడం జరిగింది. అదేవిధంగా యువత జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్ వంటి వాటిపై ప్రజలలో అవగాహన కల్పించవలసిన బాధ్యత యువతరానిదే అని తెలిపి నారు. ఎన్ఎస్ఎస్ మూడవ విభాగం ఆధ్వర్యంలో మల్కాపూర్ లో జరుగుతున్న ప్రత్యేక శీతాకాల శిబిరంలో బాలికలు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యాబోధనతోపాటు వారికి వివిధ రకాలైన ఆటలను ఆడించడం జరిగిందని, గ్రామములో ర్యాలీని నిర్వహించి ప్రజలలో సాంఘిక, ఆర్థిక అంశాలపై ,వివిధ రకాలైన అంటువ్యాధులపై అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ సదయ కుమార్, డాక్టర్ వాణి, డాక్టర్ జగదీశ్వర్, ట్రాఫిక్ పోలీస్ అధికారులు సాయిలు ,రాములు, గోప్య చౌహన్, ట్రాఫిక్ ఏఎస్ఐ ప్రకాష్ రావు, కానిస్టేబుల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.