- దొంగరాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకున్నది వాస్తవం కదా..
- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ప్రజ తీర్పు, కార్య కార్యకర్తల శ్రమను లెక్కచేయకుండా ఒక పార్టీనుంచి గెలిచి స్వలాభం కోసం మరో పార్టీలోకి జంప్ అయినా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీకు దమ్ముంటే రాజీనామా చేసి ప్రజా తీర్పును కోరాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ డా. బోగ శ్రావణి సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కమల నిలయంలో మీడియా సమావేశంలో శ్రావణి మాట్లాడుతూ జీవన్ రెడ్డి టీడీపీకి, మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. తాను కూడా జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి, అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష బిజెపిలో చేరాననీ శ్రావణి గుర్తు చేశారు. మరి మీరు దొంగ రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారనీ చెబుతూ కార్యకర్తలు, నాయకులకు చెప్పకుండా బీ ఆర్ ఎస్ ను విడడం న్యాయమేనా అనీ ప్రశ్నించారు. 2018లో లక్ష ఓట్లు వచ్చాయని గర్వంగా చెప్పుకున్నా మీకు 2023 లో 40వేల ఓట్లు ఎందుకు తగ్గాయనీ, కోట్లు ఖర్చు పెడితే 8 శాతం ఓట్ల తేడాతో గెలిచారన్నారు. మీరు అనుభవిస్తున్న పదవి ప్రజల బిక్ష, నిన్ను నమ్మిన కార్యకర్తల కష్టం, మిమ్మల్ని గెలిపించిన నాయకులు జైలులో ఉoటే వాళ్ళను మర్చిపోయి దొంగరాత్రి బిల్లుల కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నీతులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. జగిత్యాలలో కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మీతోనే సాధ్యమన్నారు. 2017లో భూమి పూజ చేసిన డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పటివరకు పూర్తికాలేదనీ, ఎమ్మెల్యే బంధువులే కదా కాంట్రాక్టర్లు ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ లో ఏ పార్టీ నుండి టికెట్ తెచ్చుకున్నా, నేను బిజెపి తరపున నిలుచుంటా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రా అనీ ఎమ్మెల్యే కు సవాల్ చేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సిరికొండ రాజన్న,మహిళ మోర్చా ప్రదాన కార్యదర్శి సాంబరి కళావతి, మహిళ మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, పవన్ సింగ్, సింగం పద్మ, కాశెట్టి తిరుపతి, గడ్డల లక్ష్మి ఇట్యాల రాము పాల్గొన్నారు.