కరీంనగర్ పట్టణ ఆవోపా అధ్యక్షులు నలమాసు సుదర్శనం ఆధ్వర్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ డివిజన్ నుండి ఎన్నిక కాబడిన ఆర్య వైశ్య కార్పోరేటర్ వంగల పవన్ ను, 57వ డివిజన్ నుండి ఎన్నిక కాబడిన మరో ఆర్యవైశ్య కార్పొరేటర్ కొలిపాక రమ్య శ్రీనివాసు ను పట్టణ ఆవోపా పాలకవర్గం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శేష వస్త్రం మరియు పూల మొక్క తో ఘనంగా సన్మానించడం జరిగింది. ఎన్నిక కాబడిన కార్పొరేటర్లు మాట్లాడుతూ సమాజ సేవలో తామెప్పుడు ముందుంటామని, కరీంనగర్ పట్టణ ఆవోపా నిర్వహిస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నలుమాచు చంద్రశేఖర్, గజవాడ శ్రీనివాస్, కోశాధికారి కట్కూరి చంద్రశేఖర్, ముస్త్యాల సతీషకుమార్.,అయిత యోగేంద్ర ప్రసాద్, పుల్లూరు రవీందర్, బీవీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.