ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ కు చెందిన వైద్యులు డాక్టర్ వేణుగోపాల కృష్ణ, ఆయన కూతురు డాక్టర్ సుహాసిని వారి
“ప్రేమతో నాన్న” లఘు చిత్రానికి ఉత్తమ నటీనటులుగా నంది పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్ లోని బిర్లా ఆడిటోరియంలో ఆదివారం రాత్రి మెగా ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీరు పురస్కారాన్ని స్వీకరించారు.ప్రేమతో నాన్న మొదటి భాగానికి కూడా ఇదివరకే ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. కుటుంబ విలువలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, జీవితంలోని కష్టసుఖాల నేపథ్యంలో నిర్మించిన ఉత్తమ చిత్రంగా ప్రేమతో నాన్న గుర్తింపు పొందింది. వేణుగోపాలకృష్ణ, కూతురు సుహాసిని ఇద్దరూ వైద్యరంగంలో ఉంటూ కళా రంగంలో విశిష్ట సేవలందించడం అభినందనీయమని నిర్వాహకులు కొనియాడారు. సంస్థ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ తో పాటు మాజీ కేంద్రమంత్రి, నిర్మల్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ వేణుగోపాలచారి తో పాటు టీవీ సినీ కళాకారులు అల్లం అనిల్, సభ్యులు శిరీషారెడ్డి, రుద్ర శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.