Take a fresh look at your lifestyle.

మానసిక శారీరకంగా దృఢంగా ఉండాలంటే యోగా చేయాలి

  • సీనియర్ సివిల్ జడ్జి ఏ శ్రీదేవి
  • జూనియర్ సివిల్ జడ్జ్ జె కావ్య

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కల్వకుర్తి కోర్టు ఆవరణలో శనివారం యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి ఏ .శ్రీదేవి, జూనియర్ సివిల్ జడ్జి జె. కావ్య లు యోగ డే పాల్గొని మాట్లాడారు. అన్ని వయసుల వారికి యోగ అవసరమన్నారు.ప్రతి మనిషి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే ప్రతి రోజు యోగా చేయడం ఎంతో అవసరం అన్నారు.యోగ ప్రాధాన్యత గుర్తించి ప్రపంచంలోని చాలా దేశాలు యోగాను అనుసరిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏజీపీలు వెంకటరెడ్డి, లక్ష్మణ్ రాజ్ న్యాయవాదులు బృంగి అమరేందర్, భాస్కర్ రెడ్డి, జమీల్ అహ్మద్, జయంత్ కుమార్, శివకుమార్, శ్రీను సివిల్ కోర్ట్ సూపర్డెంట్ ఆనంద్ సిబ్బంది చంద్రశేఖర్ స్వరూప, అనిల్, శ్రీలత, డి శ్రీలత, పి శ్రీలత , జూనియర్ కోర్ట్ సివిల్ సూపరిండెంట్ సత్యం సిబ్బంది పార్వతమ్మ, స్వామి, రాజేంద్రప్రసాద్, దినేష్, శంకర్ పారిజాత, దేవి, మౌనిక, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.