రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్ గౌడ్ అన్నారు.శనివారం జయంశంకర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.స్థానిక జయశంకర్ చౌరస్తా వద్ద విగ్రహానికి పార్టీ నాయకులు,కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సీనియర్ నాయకుడు రామిడి కుమార్,మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య, రేవెల్లి ఓదెలు, జిలకర మహేష్, అలుగల సత్తయ్య, జాడి శ్రీనివాస్, అనిల్ రావు,శశి, కుమార్, ఖలీమ్, లక్ష్మీకాంత్, చంద్రకిరణ్, రాజేందర్ పాల్గొన్నారు.